విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఉదయపూర్‌లోని అందమైన ప్రదేశాల్లో ప్రారంభమయ్యాయి. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్‌లో వివాహం చేసుకోనున్నారు.
పెళ్లికి ముందు అభిమానులు 2018లో జరిగిన గీతా గోవిందం(Geetha Govindam) సక్సెస్ మీట్‌కు సంబంధించిన పాత వీడియోలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఆ వేడుకలో యాంకర్ సుమా విజయ్ తల్లిదండ్రులను భవిష్యత్తు కోడలిపై వారి అభిప్రాయాలు ఏమిటని ప్రశ్నించారు.
విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ…బాబును మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు. అతనిని నిరుపాధికంగా ప్రేమించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతన్ని అర్థం చేసుకునే అమ్మాయి కావాలి అని అన్నారు.
విజయ్ తండ్రి గోవర్ధన్ మాట్లాడుతూ…అతను ఎవరిని ఇష్టపడితే ఆమెనే పెళ్లి చేసుకోవాలి. నాకు కులం, మతం వంటి అంచనాలు లేవు. ఇండియన్ అమ్మాయి, ముఖ్యంగా దక్షిణ భారతీయురాలైతే నాకు సంతోషం అని చెప్పారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ…నాకు లవ్ మ్యారేజ్ మాత్రమే. కానీ నా తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడాలి అని స్పష్టం చేశారు.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

