జన నాయగన్ వివాదంపై విజయ్‌

3
- Advertisement -

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ అడ్డంకులతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మాతలు అప్పీల్ చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని సుప్రీంకోర్టును కోరింది.

ఈ సమస్య మొదలై దాదాపు నెలరోజులు గడిచినా విజయ్ మౌనం పాటించడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఈ విషయంపై తొలిసారిగా స్పందించారు. “నా రాజకీయ ప్రవేశం వల్లే ‘జన నాయగన్’ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నా వల్ల నా నిర్మాత ఇబ్బంది పడుతున్నాడని నాకు బాధగా ఉంది. రాజకీయాల్లోకి రావడం వల్ల నా సినిమాపై ప్రభావం పడుతుందని ముందే మానసికంగా సిద్ధంగా ఉన్నాను” అని విజయ్ తెలిపారు.

సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజకీయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సెన్సార్ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో, సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.

Also Read:మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

- Advertisement -