వారసుడుపై సందేహాలు ?

196
- Advertisement -

సంక్రాంతి పోటీలో అన్నీ సినిమాలు డేట్ ఫిక్స్ చేసేసుకొని ఫిక్సయి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. అయితే వారసుడు కి మాత్రం ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు మేకర్స్. విజయ్ తో దిల్ రాజు నిర్మించిన ‘వరిసు’ జనవరి 11 న తమిళ నాట రిలీజవుతుంది. అయితే తెలుగులో మాత్రం మేకర్స్ డేట్ ప్రకటించలేదు. రిలీజ్ డేట్ వేయకుండానే తెలుగులో ప్రమోషన్ జరుగుతుంది.

దీంతో వారసుడు రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులకు సందేహాలు మొదలయ్యాయి. వారసుడు తెలుగు స్టేట్స్ లో సంక్రాంతి కాకుండా కాస్త ఆలస్యంగా వస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతానికి దిల్ రాజు నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ తెలుగులో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేటవుతున్నాయని తెలుస్తుంది. మరి వారసుడు తెలుగులో కూడా సంక్రాంతి కే వస్తాడా ? లేదా రెండు మూడు రోజుల తర్వాత థియేటర్స్ లో అడుగుపెడతాడా ? తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చేంత వరకు వారసుడు తెలుగు రిలీజ్ పై ఇలాంటి సందేహాలు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త పోస్టర్ తో రిలీజ్ డేట్ చెప్పేస్తే ఇక ఈ సందేహాలకు ఫులి స్టాప్ పడుతుంది.

ఇవి కూడా చదవండి…

- Advertisement -