లిక్కర్ కింగ్ మాల్యా అరెస్ట్…

182
Vijay Mallya Arrested In London By Scotland Yard
- Advertisement -

ఎట్టకేలకు కింగ్ ఫిష్ చిక్కింది. బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగ్గోట్టి  దేశం విడిచిపారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్‌లో స్కాట్లాండ్ పోలీసులు  అరెస్ట్ చేశారు.ఆయ‌న‌ను వెస్ట్‌మిన్‌స్ట‌ర్‌లోని కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. మాల్యాను ఇండియాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. తొందర్లోనే సీబీఐ టీమ్ లండన్ కు వెళ్లనుంది. బ్రిటన్ తో ఇండియాకి కుదిరిన ఓ ఒప్పందం మేరకు ఈ అరెస్టు జ‌రిగింద‌ని తెలుస్తోంది.

మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న మాల్యాపై.. ఇప్పటికే అనేక అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భారత్ మాల్యా పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. ఆయన్ని వెంటనే దేశం నుంచి పంపించేయాల్సిందిగా కూడా భారత్ బ్రిటన్ ను కోరింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పాస్ పోర్ట్ రద్దయినా.. అతను బ్రిటన్ లోనే ఉండే అవకాశం ఉంటుంది.

దీంతో మాల్యా  తనకు జారీ చేసిన సమన్లపై స్పందించకుండా మొండి వైఖరి కనబర్చారు. అంతేగాక, లండన్ లో ఎంజాయ్ చేస్తూ ట్విటర్ లో ట్వీట్లు చేస్తూ భారతీయులకు ఆగ్రహం తెప్పించారు. ఆయనను భారత్ కు రప్పించడానికి అక్కడి చట్టాలు అడ్డుపడ్డాయి. భారత్ ప్రభుత్వం, యూకే మధ్య కుదిరిన ఓ ఒప్పందం ప్రకారం యూకే పోలీసులు ఇవాళ మాల్యాను  అరెస్టు చేశారు.

గత మేలో తన రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా చేశారు .  మాల్యా నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు అతని ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో విజయ్ మాల్యాకు చెందిన విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను రిజర్వ ధర 73 కోట్లకు దక్కించుకున్నాడు సినీనటుడు సచిన్ జోషి.  అరేబియా సముద్రానికి ఎదురుగా వున్న ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి.

- Advertisement -