తన నటన, గ్లామర్ తో టాలీవుడ్ లో ఒక హైప్ ను క్రియేట్ చేసుకుంది సమంత. ఐతే, గత కొన్ని రోజులుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సామ్.. తాజాగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. తాజాగా సామ్ ఈ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేస్తూ తన లుక్‌ను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఇందులో సామ్ మోడ్రన్ లుక్‌లో, స్టైలిష్ కాప్‌గా కనిపిస్తుంది. సామ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఈ లుక్ చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఒకతను.. సామ్ కి ఒక ట్వీట్ పెట్టాడు.
సమంత గారు మా ఖుషి సినిమా పరిస్థితి ఏమిటి ? అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్ పెట్టిన మెసేజ్ చూసిన సమంత అతనికి సమాధానం ఇచ్చింది. ‘ఖుషి’ మూవీ పై సామ్ స్పందిస్తూ.. ‘ఖుషి అతి త్వరలో పునఃప్రారంభం అవుతుంది. దేవరకొండ అభిమానులకు సారీ’ అంటూ సమంత రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మయోసైటిస్ వ్యాధి నుండి వేగంగా కోలుకుంటున్న సమంత మళ్లీ వరుస షూటింగ్‌లతో బిజీ అయ్యింది.
అయితే, విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖుషి పక్కా ప్రేమకథ కావడం, పైగా ఈ సినిమాలో సమంతకి విజయ్ దేవరకొండకి మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans
@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
ఇవి కూడా చదవండి…