‘టాక్సీవాలా’ కోసం వస్తున్న మెగాహీరో‌..

254
Taxi Wala
- Advertisement -

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ నెల 11వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు.

Allu Arjun

ఆ రోజున సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జెఆర్సీ కన్వేషన్‌లో ఈ వేడుక మొదలు కానుంది. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా ప్రియాంక జవల్కర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఈ సినిమాతో మరో సక్సెస్ విజయ్ దేవరకొండకి దొరికినట్టేనని అభిమానులు చెప్పుకుంటున్నారు.

- Advertisement -