రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తుండగా, వారికి సంబంధించిన లుక్స్ ఒక్కో రోజు విడుదల చేశారు.
డిసెంబర్ 12న ఐశ్వర్యా రాజేష్, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖన్నా లుక్స్ విడుదలయ్యాయి. తాజాగా ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. కొన్ని సన్నివేశాల్లో అర్జున్ రెడ్డి సీన్స్ ను రిపీట్ చేశారు. నలుగురు హీరోయిన్లతో విజయ రోమాన్స్ చేసినట్లు టీజర్ చూస్తే అర్ధమైపోతుంది. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈమూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
https://youtu.be/nYNY7kVzPX0