విజయ్‌దేవరకొండతో రష్మిక…

8
- Advertisement -

రష్మిక మందన్నా… కుర్రకారు గుండెల్లో క్రష్మిక మందన్నాగా గూడుకట్టుకున్న రష్మిక మందన్నా టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ గా కొనసాగుతున్నారు. తనదైన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న రష్మిక, ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్‌ లో సైతం పలు సినిమాల్లో నటిస్తోంది. ఈ బాలీవుడ్‌ లో నటించిన మిషన్‌ మజ్నూ మూవీ రిలీజ్‌ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మిక ప్రమోషన్స్‌ లో బిజీగా ఉంది.

ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా రష్మిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తాను త్వరలోనే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ వార్తపై పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. పలువురు పలు రకాలుగా స్పందించారు. ఇప్పటికే రష్మిక, విజయ్‌ దేవరకొండల మద్య ఏదో నడుస్తోందని.. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. డేటింగ్‌ చేస్తున్నారన్న చర్చ కూడా సాగుతోంది. దీనికి తోడు వీరిద్దరు ఇటీవల మాల్దివ్స్‌ కి కలిసి వెళ్లారని.. అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరిగారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన గీతా గోవిందం సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత వచ్చిన డియర్‌ కామ్రెడ్‌ మూవీ కూడా పరవాలేదనిపించింది. రష్మిక కూడా మళ్లీ విజయ్‌ దేవరకొండ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది. దీంతో ప్రేక్షకులు కూడా రష్మిక, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌ లో మళ్లీ సినిమా రావాలని కోరుకుంటున్నారు.

- Advertisement -