తండ్రి కాబోతున్న విజయ్‌ దేవరకొండ..?

246
vijay devarakonda
- Advertisement -

టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్‌ దేవరకొండ తండ్రయ్యాడు. అదేంటి ఇంకా పెళ్లే కాలేదు అప్పుడే తండ్రిగా ప్రమోషన్‌ ఏంటని ఆలోచిస్తున్నారా..?అవును మీరు వింటున్నది నిజమే..ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలకే పరిమితమైన దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తండ్రిపాత్రలోనే కనిపించనున్నారట.

ఇందులో విజయ్‌కి పదేళ్ల కొడుకు ఉంటాడట. సింగరేణి కార్మికుల కోసం పోరాడే యూనియన్ లీడర్ పాత్రను చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే డియ‌ర్ కామ్రేడ్ సినిమా పూర్తి చేసిన విజ‌య్.. క్రాంతి మాధ‌వ్ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాడు.

కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఏకంగా న‌లుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. రాశి ఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, ఇస‌బెల్లా పేర్లు ఫైనల్‌ కాగా మరో హీరోయిన్‌గా కేథరిన్‌ థెరిసాను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తిగా తెలంగాణ నేటివిటీతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఓనమాలు,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో సత్తా చాటిన క్రాంతి…విజయ్‌తో చేయబోయే ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -