అర్జున్ రెడ్డి మూవీ తర్వాత కథానాయకుడు విజయ్ దేవరకొండ మళ్లీ సోలో బాక్స్ ఆఫీస్ హిట్ ఎప్పుడు కొడతాడా అని అతని ఫాలోవర్స్ చాలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మహానటి సినిమాలో కనిపించినప్పటికి అది తన విజయం కాదని ఒప్పుకున్నాడు. గత కొంత కాలంగా రూపుదిద్దుకుంటున్న ‘టాక్సీవాలా’ సినిమాపైనే విజయ్ ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ సారి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకున్నాడు.
హారర్ మరియు మంచి కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఆ సినిమాలో విజయ్ ఒక టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. విజయ్ నటిస్తున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట. మరి ఈ మూవీ విజయ్ దేవరకొండకు విజయం అందిస్తుందో లేదో ఇంకా కొంత కాలం వేచి చూడాలి.