సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

387
Vijay Devarakonda
- Advertisement -

యువ హీరో విజయ్ దేవరకొండ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ కోసం పెద్ద పెద్ద దర్శకులు కూడా క్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈనెల 26న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల అవుతుంది.

ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గోన్న విజయ్ దేవరకొండ సంలచన వ్యాఖ్యలు చేశాడు. తాను సినిమాలకు ఎప్పుడైనా గుడ్ బై చెప్పోచ్చనని..సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే యాక్టింగ్ మానేసి అది చేస్తానని చెప్పారు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా ఇప్పుడు తనకు 30సంవత్సరాలు ఉన్నాయి…ఇంకో ఐదు సంవత్సరాలకు చేసుకుంటానని చెప్పారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జోడీ కట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. టీజర్ , ట్రైలర్ కు పెద్ద ఎత్తున స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -