డేటింగ్ రూమర్స్​పై స్పందించిన విజయ్!

1
- Advertisement -

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పందించారు విజయ్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్… సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు అందరికి చెబుతానని అన్నారు.

ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో షేర్ చేసుకోవాలి అని నేను అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతానని స్పష్టం చేశారు. అందుకు సమయం రావాలి. దానికంటూ ఒక ప్రత్యేక సందర్భం, కారణం ఉండాలని చెప్పుకొచ్చారు విజయ్.

పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్​ గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తారు. దానిని నేను వృత్తిలో భాగంగానే భావిస్తాను అని తెలిపారు విజయ్. ప్రస్తుతం విజయ్ ‘VD12’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Also Read:KTR: ఎన్టీఆర్‌ పై పిల్లి కూతలా?

- Advertisement -