బెట్టింగ్ యాప్స్ కేసు..స్పందించిన విజయ్

4
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడంపై స్పందించింది విజయ్ దేవరకొండ టీం. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడు అన్నారు.

విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తాం అని విజయ్ దేవరకొండ టీం తెలిపింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల మీద పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా 25 మంది సెలబ్రెటీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.

Also Read:బెట్టింగ్ యాప్స్‌.. హీరోలపై కేసు!

- Advertisement -