- Advertisement -
యూత్ సెన్సెషన్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీలో బిజిగా ఉన్నాడు. ఈమూవీలో విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించగా..మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ మూవీతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా కూడా ప్రారంభమైంది. దీంతో పాటు మజిలి సినిమా దర్శకుడు శివ నిర్వాణతో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. శివ నిర్వాణ నిన్నుకోరి, మజిలి సినిమాలతో రెండు భారీ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడో వేచి చూడాలి.
- Advertisement -