విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్

480
puri-vijay
- Advertisement -

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో చాలా హ్యాపిగా ఉన్నాడు. రామ్ హీరోగా నటించిన ఈసినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్లుగా నటించారు. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. దాదాపు రూ.80కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. పూరీ తన సొంత బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ఇక ఈసినిమా తర్వాత పూరీ ఎవరితో చేస్తాడని ఎదరుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం పూరీ తన తర్వాతి మూవీ సస్సెషనల్ హీరో విజయ్ దేవరకొండతో తీయనున్నాడని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ నిరాశలో ఉన్నారట. పూరీతో ఒక మాస్ సినిమా తీసి మళ్లి తన సత్తా చాటాలని భావిస్తున్నాడట విజయ్. ఇప్పటికే పూరీ విజయ్ కి కథ వినిపించాడట. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించాలని భావిస్తోందట.

అయితే ఇందుకు పూరీ ఒక కండీషన్ పెట్టాడని తెలుస్తుంది. తమ బ్యానర్ కూడా సినిమా నిర్మాణంలో యాడ్ అవ్వాలని.. అలానే నిర్మాణ బాధ్యతలు ఛార్మికి ఇవ్వాలని అతడికి కొన్ని షరతులు పెట్టాడని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తర్వాత పూరీ విజయ్ కాంబినేషన్ లో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -