షికారు చేస్తున్న దేవరకొండ..

205
Vijay devarakonda Next movie
- Advertisement -

యూత్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండకి ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. కారణం ‘అర్జున్ రెడ్డి‘గా కనిపించడం. ఈ సినిమా తర్వాత దేవరకొండ చేసే సినిమాలకు భారీ క్రేజ్ స్టార్టైంది. ఈ క్రమంలోనే దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Vijay devarakonda Next movie

గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. కథ కూడా క్యాబ్ చుట్టూనే తిరుగుతుంది .. అందువలన ఈ సినిమాకి ‘షికార్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

యూత్ తో పాటు మాస్ ఆడియాన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా .. డాక్టర్ పాత్రలో ప్రియాంకా జవాల్కర్ కనిపించనుంది.

ఇక ఈ సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలోను విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు. ఇవే కాకుండా ఆయన చేతిలో మరో మూడు .. నాలుగు ప్రాజెక్టులు వున్నాయి. ఇక వచ్చే ఏడాది వరుస సినిమాలతో ఆడియన్స్ ను ఫుల్ ఖుషీ చెయ్యనున్నాడు విజయ్ దేవరకొండ.

- Advertisement -