VD14:రణబాలిగా విజయ్

3
- Advertisement -

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న విజయ్ దేవరకొండ 14వ చిత్రం (VD14) టైటిల్ టీజర్ విడుదలై అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేయగా, అందులో విజయ్ దేవరకొండ పూర్తిగా కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. టీజర్‌లో ఆయన ఒక వీరుడిగా, రణబాలిగా కనిపిస్తూ శక్తివంతమైన డైలాగ్‌లు, గంభీరమైన లుక్‌తో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా, చరిత్ర, యుద్ధ నేపథ్యంతో కూడిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్ స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను సినిమాపై మరింత ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. విజయ్ కెరీర్‌లో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుందన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా రష్మిక మందాన నటిస్తుండటం మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, వారి కెమిస్ట్రీపై భారీ అంచనాలున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్థాయిలో విడుదల ప్రణాళికలు ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. టైటిల్ టీజర్‌తోనే సంచలనం సృష్టించిన VD14, విడుదలయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద రణరంగం సృష్టిస్తుందనే నమ్మకం బలంగా కనిపిస్తోంది.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అశ్విని రాజ్‌కుమార్‌

- Advertisement -