పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దీనిపై ముంబైలోని మరాఠా మందిర్, గేలాక్సీ థియేటర్స్ ఓనర్ మనోజ్ దేశాయి తీవ్రంగా స్పందించారు. తన సినిమా నచ్చితే చూడమని లేకపోతే లేదని చెప్పడంతో తమ థియేటర్ల వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌లో తీవ్ర ప్రభావం చూపిందంటూ మనోజ్ దేశాయి మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో మనోజ్ ని కలిశారు విజయ్. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మనోజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. తాను థియేటర్లకు ఆడియెన్స్ రావద్దని చెప్పలేదని.. తన కామెంట్స్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలో మనోజ్ దేశాయి కూడా విజయ్ చేసిన కామెంట్స్‌ను తాను పూర్తిగా అర్థం చేసుకోలేదని.. ఓటీటీలపై తనకున్న కోపం కారణంగా విజయ్ను తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిపారు.