మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న రౌడీ హీరో

327
Vijay Devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇటివలే ఈచిత్రం టీజర్ ను విడుదల చేశారు. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈమూవీకి ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

Puri Jagannth Vijay Devarakonda

ఈమూవీలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఇందుకోసం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నాడట.15 మంది ట్రైన‌ర్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి మార్ష‌ల్ ఆర్ట్స్‌తో పాటు ప‌లు ఫైట్స్‌కి సంబంధించి శిక్ష‌ణ ఇస్తున్న‌ట్టు తెలుస్తుంది. త‌న పాత్ర కోసం విజ‌య్ డైట్ విష‌యంలోను కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ట‌. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈమూవీని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో మొదలవుతుంది.

- Advertisement -