అర్జున్ రెడ్డి..ఈజ్ బ్యాక్

189
Vijay Devarakonda is back
- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రంతో యూత్ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ దేవరకొండ. లో బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి నిర్మాతల పంట పండించింది.ఈ సినిమా తర్వాత వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్న విజయ్ చేతిలో అరడజన్‌కి పైగా సినిమాలున్నాయి.

ఇట్స్‌ టైమ్‌.. ఐ యామ్‌ బ్యాక్‌… అంటూ విజయ్‌ దేవరకొండ తన ట్విటర్‌లో ఈ చిత్ర ప్రీలుక్‌ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్‌ కింద ‘ఫస్ట్‌ లుక్‌ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్‌ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌ రోల్‌లో కనిపించబోతుండగా.. షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

GA2 UV TEASER POSTER LOCK shoot

దీంతో పాటు మరోసారి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏం మంత్రం వేసావెలో హీరోగా నటించనున్నాడు.దీపావళి సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తిని పెంచింది. గోలిసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వస్తున్న ‘మహానటి’ చిత్రంలోనూ విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -