బిగ్‌బాస్‌: విజయ్‌ పెళ్లిపై నాగ్‌ కామెంట్స్‌..!

480
vijay devarakonda
- Advertisement -

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. షో ఇంకొద్ది రోజుల్లో ముగియనుండడంతో కొట్లాటలు.. తిట్టులతో పాటు రోజుకో అనుకోని గెస్ట్‌లు హౌజ్‌కు వస్తూ.. అలరిస్తున్నారు.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీవాళి సెలబ్రేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌కి విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకువచ్చారు నాగార్జున. నిన్నటి ఎపిసోడ్‌లో ‘మీకు మాత్రమే చెప్తా’.. సినిమా టీమ్ సందడి చేసింది.

bigg-boss

ఈ ఎపిసోడ్‌లో నాగ్‌ విజయ్‌ పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు..‘నీ పెళ్లి గురించి ప్రతి ఆరునెలలకు ఒక రూమర్ వస్తూనే ఉంటుంది కదా… నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడగ్గా.. ‘ఇంకా తన అమల దొరకలేదు’ అంటూ పంచ్ పేల్చాడు విజయ్.

దీంతో నాగార్జున ‘నీకు నీ అమల త్వరగా దొరకాలని కోరుకుంటున్నా’ అని బదులిచ్చారు. ఇక నిన్నటి ఎపిషోడ్‌టో ఇద్దరు ఎలిమినేషన్‌కి నామినేట్‌ అవ్వగా అందులో ఒక్కరు హౌస్‌ నుండి వెళ్లిపోయారు. అ హౌస్‌మోట్‌ ఎవరో కాదు శివజ్యోతి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఐదుగురు మెంబర్స్‌ ఉన్నారు.

- Advertisement -