రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వలర్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈచిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేశాడు దర్శకుడు పూరీ. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీకి ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఈసినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు. అయితే ఈమూవీలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈమూవీ కోసం జాన్వీ కపూర్ భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ కోసం పూరీ జగన్నాథ్ మరీ ఇంత ఖర్చు చేస్తున్నాడు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.. జనవరి మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా..సమ్మర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.