Vijay Devarakonda:’ఫ్యామిలీ స్టార్’ బజ్ లేదేంటి!

11
- Advertisement -

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఏప్రెల్ 5న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. టీజర్ మినహా మిగిలిన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు, దాంతో రిలీజ్ కు ఎంతో సమయం లేకపోయినప్పటికి మూవీపై ఎలాంటి బజ్ కనిపించడం లేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సాధారణంగా తన మూవీ రిలీజ్ దగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో యమ యాక్టివ్ గా కనిపించే విజయ్ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ మూవీ విషయంలో మాత్రం అంతా యాక్టివ్ గా కనిపించడం లేదు, దానికి తోడు ప్రేక్షకుల్లో కూడా మూవీపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో విజయ్ కి మరో ఫ్లాప్ తప్పదా అనే టాక్ వినిపిస్తోంది. .

అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతమౌతున్నాడు. గత ఏడాది వచ్చిన లైగర్, ఖుషీ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి ముఖ్యంగా లైగర్ మూవీ అందించిన రిజల్ట్ పాన్ ఇండియా స్థాయిలో విజయ్ క్రేజ్ ను బారిగానే దెబ్బ తీసింది. ఇన్ని ప్రతికూలతల మధ్య ఏప్రెల్ 5 న ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్.

ఈ మూవీకి పరశురాం దర్శకుడు కావడంతో మూవీ రిజల్ట్ పై విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబట్టింది. దాంతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. అయితే గతంలో మీడియా సమావేశాల్లో విజయ్ యాటిట్యూడ్ పై తీవ్ర విమర్శలే వ్యక్తమయ్యాయి. ఆ ఎఫెక్ట్ తో ఈసారి ప్రెస్ మీట్ లలో విజయ్ కొంత సైలెంట్ గానే కనిపిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికి ఫ్యామిలీ స్టార్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్న విజయ్ కి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.

Also Read:Gold Rate:రికార్డు స్థాయికి జంప్

- Advertisement -