యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ యువ కథానాయకుడు సినీ రంగ ప్రవేశం చేసిన అతి కొద్ది కాలంలోనే పాన్ ఇండియా హీరోగా రంగ ప్రవేశం చేయనుండటం విశేషం. విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు.
ఏషియన్ సినిమాస్‌తో కలిసి తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో ఏవీడీ( ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ లాంచ్ చేస్తున్నాడని టాక్. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ మొదలు కాగా, సమ్మర్ వరకు థియేటర్‌ని పూర్తి చేస్తారట. ఆ తర్వాత హైదరాబాద్‌తో పాటు పలు ఏరియాస్‌లో విజయ్ దేవరకొండ, సునీల్ నారంగ్ మల్టీప్లెక్స్ బిజినెస్‌ని విస్తరిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ ఫైటర్,వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.