నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి చేశారు. పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చిన విజయ్ దేవరకొండ దంపతులకు ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు, అభిమానులు.
కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు విజయ్ దేవరకొండ దంపతులు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. సొంత గ్రామంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది అన్నారు.
పెళ్లి చేసుకున్న శుభ సందర్భంగా విద్యార్థులకు దేవరకొండ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్కాలర్‌షిప్‌లు ప్రకటించారు విజయ్. అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలలో నైన్త్ టెంత్ క్లాస్ విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్లు అందజేస్తాం అన్నారు.
స్వగ్రామంలో ఇల్లు భూమి ఉంది ఇకనుంచి రెగ్యులర్‌గాగ్రామానికి వస్తాను… పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.
Also Read:వేసవిలో మోకాళ్ల నొప్పి…వైద్యుల హెచ్చరిక!

