వైరల్‌ అవుతున్న విజయ్ దేవరకొండ వీడియో..

401
Vijay Devarakonda
- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్షేషనల్ స్టార్ దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయిన యంగ్‌ హీరో గురించి చిన్న విషయమైనా కూడా వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ చిన్న మాట మాట్లాడినా కూడా ఆ విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Vijay Devarakonda

ఈ వీడియో 1999 సమయంలోది. అప్పట్లో షావుకారు జానకితో కలిసి విజయ్ ఓ టీవీ సీరియల్‌లో నటించాడు. దీన్ని సంపాదించిన ఓ అభిమాని, విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై విజయ్‌ స్పందిస్తూ.. ‘నా చిన్ననాటి విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నట్లున్నాయ్‌. ఆ బాలుడు కూడా స్టారే. నేను కూడా ఈ వీడియోని బాగా చూస్తున్నాను. వీడియోను ఎవరైతే పోస్ట్‌ చేశారో వారు నన్నే కాదు మా అమ్మతో పాటు అభిమానులను కూడా సంతోషపరిచారు’ అని పేర్కొన్నారు విజయ్‌.

- Advertisement -