ఏఎన్నాఆర్‌గా విజయ్ దేవరకొండ..

182
Vijay Devarakonda as ANR in 'Mahanati'
- Advertisement -

భారతీయులు గర్వంచదగ్గ నటీమణుల్లో సావిత్రి కూడా ఒకరు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బయోపిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా తీస్తున్నాడు. చాలా మంది నటులు, దర్శకులు ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో హీరో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో విజయ్ దేవరకొండ అక్కినేని నాగేశ్వర రావ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ మంచి స్నేహితులట. వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది.

అలనాటి నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌ శివాజీ గణేశన్‌ పాత్రలోనటిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

- Advertisement -