విజయ్ దేవరకొండ …ఒక మంచి పని !

148
- Advertisement -

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా తన మంచి మనసు చాటుకున్నాడు. తన స్పీచ్ లతో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ తో ఎప్పటి కప్పుడు నెటిజన్ల ను ఎట్రాక్ట్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యే విజయ్ ఇటీవల తన అవయవాలకు దానం చేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు.

రీసెంట్ గా ఓ హాస్పిటల్ కి సంబంధించి ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన ఆర్గాన్స్ ను డొనేట్ చేస్తూ సైన్ చేశానని తెలిపాడు. మరణం తర్వాత మన అవయాలు ఇతరుల సంతోషానికి కారణం అవుతాయని, అందరూ ముందుకొచ్చి ఈ పని చేయాలని కోరాడు.

ఇక విజయ్ ఏం చేసినా అతన్ని ట్రోల్ చేస్తూ అతన్ని డీ ఫేమ్ చేసే బ్యాచ్ ఇప్పుడు విజయ్ చేసిన ఈ మంచి పనిని మెచ్చుకొని పోస్టులు పెట్టాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. మరణం తర్వాత ఇలా తమ అవయవాలు మరొకరికి పనికొస్తాయని, వారి ఆనందానికి కారణం అవుతాయని విజయ్ లా ముందుకొచ్చి ఆర్గాన్స్ డొనేట్ చేసే హీరోలెందరుంటారు. ఏదేమైనా విజయ్ చేసిన ఈ గొప్ప పని తెలుసుకొని సోషల్ మీడియాలో అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ విజయ్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు షూటింగ్ కి బ్రేక్ పడిన ఈ సినిమా త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి..

ప్రిన్స్‌ ఓటీటీలోకి ఎప్పుడంటే…

జూ.ఎన్టీఆర్‌@ 22యేళ్లు

RC15..ఒక్కసాంగ్‌కే కాంతారా బడ్జెట్!

- Advertisement -