విజయ్ మళ్లీ రష్మిక తోనే

2286
- Advertisement -

రష్మిక మందన్నా హాట్ ఫేవరెట్ అయిపోయినట్లుంది హీరో విజయ్ దేవరకొండకు. తన సరసన ఆమెకు మళ్లీ మరోసారి చాన్స్ ఇచ్చేసాడు. డియర్ కామ్రేడ్ లాంటి రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్నతో కలిసి కనిపించాడు విజయ్. ఆ సినిమా తరువాత మరో చాన్స్ దొరికింది రష్మిక మందన్నాకి విజయ్ దేవరకొండ సరసన. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్నునూరి డైరక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ సినిమాకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు.

గౌతమ్ తిన్నునూరి తొలిసారి విజయ్ దేవరకొండతో చేయబోతున్న సినిమా ఇది. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డే, శ్రీలీల ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇలా కొందరు హీరోయిన్లను పరిశీలించినా.. చివరకు రష్మిక మందన్నా వైపే విజయ్ దేవరకొండ మొగ్గు చూపాడు. వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది అంటూ ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి విజయ్ – రష్మిక మందన్నా రెడీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మరోపక్క ‘లైగర్’ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత హీరో విజ‌య్ దేవరకొండ సినిమాల ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది. దీనికితోడు ఫలానా డైరెక్టర్ తో విజయ్ అంటూ వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ తిన్నునూరి కథకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది.

ఇవి కూడా చదవండి…

ఇక్కడ ఎదిగి అక్కడ ఒదుగుతుంది

బాలయ్య షోలో మోక్షజ్ఞ స్వీట్ షాక్

మైఖేల్…నువ్వుంటే చాలు సాంగ్‌

- Advertisement -