జులై 24న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జన్మదినం సందర్భంగా చాలామంది యువకులు, అభిమానులు గిఫ్ట్ ఎ స్మైల్ పేరిట సమాజహితానికి, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తన జన్మదినం సందర్భంగా ఎవ్వరూ ఆర్భాటాలకు పోవద్దని, అనవసర ఖర్చులు చేయరాదని కేటీఆర్ విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. అవసరమైతే జనహిత, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ “గిఫ్ట్ ఏ స్మైల్” అనే ఛాలెంజ్‌ని స్పూర్తిగా తీసుకొని కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఎం.పి నిధులతో ఎకో టూరిజం పార్కుగా తీర్చిదిద్దబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈ క్రమంలో ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరో నితిన్ తన పెరట్లో ఓ మొక్కని నాటాడు.
దీనిపై ట్విట్టర్ ద్వారానే విజయ్‌దేవరకొండ స్పందించారు. “కేటీఆర్ అన్నకు హ్యాపీ బర్త్ డే. సంతోష్ అన్న మీరు చెప్పిన కార్యక్రమంలో భాగమవుతాను. నేను కూడా ఓ మినీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రాక్టికల్‌గా ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటాను. వలంటీర్స్‌తో ఓ చిన్న గ్రూప్‌ను ఏర్పాటు చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తాను” అంటూ తెలిపారు విజయ్ దేవరకొండ.
Happy birthday Ramannaa @KTRTRS🤗 Santosh anna- I accept your initiative- here is what I will do.
Step 1:
I pledge to develop a miniforest!After we understand the process and practicality we intend to setup a small group of trained volunteers and we will pursue this full-time https://t.co/D38ysZZUGG
— Vijay Deverakonda (@TheDeverakonda) July 24, 2019