అర్జున్ రెడ్డితో టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుస ఆఫర్లతో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. గీతగోవిందంతో ట్రెండ్ మార్చిన విజయ్ నటించిన నోటా,డియర్ కామ్రెడ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
ఈ నేపథ్యంలో విజయ్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో పారితోషికాన్ని భారీగా పెంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ రూమర్లను ఖండించారు విజయ్.ప్రతీ సినిమాకు రెమ్యునరేషన్ పెంచేద్దాం అనుకుంటానని కానీ కుదరడం లేదని తనదైన స్టైల్లో చెప్పారు. అలాగే తనకు స్టార్ డమ్ మీద నమ్మకం లేదని ఎవరో తెలియని స్ధాయి నుంచి ఇంతవరకు వచ్చానని చెప్పారు.
సినిమాల్లోకి వచ్చాక నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కానీ ప్రపంచానికే నా మీద ఉన్న అభిప్రాయం మారిందన్నారు. నాకు స్టార్‌గా ఉండాలని లేదని స్పష్టం చేశారు.