‘ర‌ష్మిక’తో ఎంగేజ్‌మెంట్.. విజయ్ క్లారిటీ

23
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా పెయిర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ ఎప్పుడు తెర‌పై క‌నిపిస్తారా ? అని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అయితే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ – గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో రాబోతున్న సినిమాలో ర‌ష్మికతో ఓ స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని మేక‌ర్స్ ట్రై చేస్తున్నార‌ట‌. ఇదే నిజ‌మైతే, ఈ సినిమాకు మంచి బజ్ రావ‌డం ఖాయం. మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వచ్చే నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ వార్తలపై విజయ్ స్పందించారు. ప్రతి రెండు ఏళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని మీడియా భావిస్తోంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉన్నాను. రష్మికతో ఎంగేజ్‌మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, వీరిద్దరూ గతంలో వెకేషన్ కి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించారు. నిజానికి గీతా గోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ప్రేమలో పడ్డారని టాక్ నడుస్తోంది.

ఆ చనువుతోనే వీరిద్దరూ ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. ఇక ప్రస్తుతం ర‌ష్మిక మంద‌న్నా.. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘పుష్ప‌ 2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం యావ‌త్ భార‌తదేశం ఎంత‌గానో వెయిట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌పై రష్మిక లేటెస్ట్ అప్డేట్ చెప్పింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో తాను వచ్చే వారం నుంచి జాయిన్ కాబోతున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.

Also Read:లండన్‌లో సీఎం రేవంత్ పర్యాటక ప్రాంతాల సందర్శన

- Advertisement -