కాశిగా వస్తున్న బిచ్చగాడు

273
Vijay Antony's 'Kaasi' First Look Poster
- Advertisement -

బిచ్చగాడు మూవీతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోగాత్మక కథలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు మూవీ తరువాత భేతాళుడు, యమన్,ఇంద్రసేన వంటి చిత్రాలలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు.

ఈ నేపథ్యంలో కాశిగా మరోసారి ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు విజయ్. ఈ చిత్రంలో తెలుగమ్మాయ్ అంజలితో పాటు మరో హీరోయిన్‌గా సునయన నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘అందమా’ అనే సింగిల్‌ని జనవరి 25వ తేదిన విడుదల చేయబోతున్నారు. కృత్తిక ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు.

Vijay Antony's 'Kaasi' First Look Poster

- Advertisement -