బిచ్చగాడు-2 ఎప్పుడంటే…

148
- Advertisement -

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన విజయ్‌ ఆంటోని. బిచ్చగాడు 2సినిమా ద్వారా మరోసారి రాబోతున్నాడు అని కోలీవుడ్‌ టాక్‌. అయితే బిచ్చగాడు కంటే మరో నాలుగైదు సినిమాలు రాబోతున్నాయాని కోలీవుడ్‌ టాక్‌. కానీ ప్రస్తుతం బిచ్చగాడు(పిచ్చైక్కారన్‌)2 చిత్రీకరణ పనులు వేగవంతం చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు సంగీత దర్శకుడిగా తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.

అయితే బిచ్చగాడు సినిమా తర్వాత తన ఖాతాలో అంతటి విజయం నమోదు కాలేదు. కానీ ఢిఫరేంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా నటించిన చిత్రం తమిళరసన్‌ బాబు యోగేశ్వరన్‌ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. ఈనెల 15న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోనీతో పాటు సురేష్‌ గోపి రమ్యానంబీశన్‌ సోనుసూద్‌ సత్యరాజ్‌ యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సారి కచ్చితంగా సక్సెస్ కొడతానని ధీమాగా ఉన్నాడు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో విజయ్ అన్ని సినిమాలలాగే తెలుగులోనూ విడుదల అవుతుందో లేదో చూడాలి మరి. ఇదిలావుండగా.. విజయ్‌ ఆంటోనీ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో అగ్ని చిరుగుకల్‌, ఖాకీ, పిచ్చైక్కారన్‌-2, మళైపిడిక్కాద మణిదన్‌ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే కొన్ని వచ్చే యేడాది విడుదలయ్యే అవకాశం ఉందని అందులో పిచ్చైక్కారన్‌ 2023 జూన్‌ నాటికి వస్తుందని ఇటీవలే సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌ ఆంటోనీ తెలిపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

శిరీష్‌తో డేటింగ్‌..నవ్వేసిన అను!

జాతిరత్నాలు దర్శకుడికి అరుదైన వ్యాధి

టిఆర్ఎస్‌ను గెలిపించిన ఎగ్జిట్ పోల్స్

- Advertisement -