బిచ్చగాడు 2 సినిమా షూటింగ్‌లో దర్శకుడు,హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మేజర్ సర్జరీ చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో సర్జరీ తర్వాత తొలిసారి స్పందించారు విజయ్.
ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్.. ట్విట్టర్ వేదికగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో పిచ్చైకారన్(బిచ్చగాడు 2) షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాను అని చెప్పారు.
ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత త్వరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. బిచ్చగాడు సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు విజయ్.
ఇవి కూడా చదవండి..