పవన్‌ కంటే విజయ్ బెటర్‌:వర్మ

193
Vijay 10 Times better than Pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వర్మ మరోసారి సెటైర్లు విసిరాడు. అర్జున్ రెడ్డి సినిమా పై నా రివ్యూ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చిన ఆర్జీవీ  విజయ్ దేవరకొండ తన నటనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే పది రేట్లు ఎక్కువగా చరిష్మా సంపాదించాడని చలోక్తి విసిరాడు. అంతేగాదు నటనలోనూ పవన్ కంటే 20  రేట్లు బెటర్‌ అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

ఈ సినిమాలో విజయ్ తన నటనతో బిగ్ బి అమితాబ్ ని తలపించాడని కితాబిచ్చిన వర్మ తెలంగాణకు మొదటి మెగాస్టార్ విజయ్ దేవరకొండ అంటూ చెప్పుకొచ్చాడు.ఈ తరం హీరోలంతా హీరోయిజం చూపించడానికి స్లో మోషన్, ర్యాంపింగ్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై ఆధారపడుతున్నారు. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ పై డిపెండ్ అవ్వకుండా హీరోయిజం చూపించిన మొట్టమొదటి హీరో విజయ్ దేవరకొండ అని చెప్పాడు.

నేను మారిపోయాను ఇక ఎవరి మీద వివాదాస్పద ట్వీట్లు చేయను, నన్ను నమ్మండి. నా వల్ల ఇబ్బంది పడ్డవాళ్లంతా నన్ను క్షమించండి’ అంటూ వర్మ గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నేను దేవుణ్ని నమ్మను కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు అందుకే ఈసారి మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్ బర్గ్ మీద బాలీవుడ్ మెగాస్టార్ సీనియర్ బచ్చన్ మీద ఒట్టేసి చెపుతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.  అయితే తాజాగా పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించి మరింత వేడిని రగిల్చాడు.

- Advertisement -