‘కమాండో’ సినిమాతో మంచి బాడీ కలిగిన హీరోగా పేరుతెచ్చుకున్న విద్యుత్ జమ్వాల్.. తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’, ‘వూసరవెల్లి’ చిత్రాలతో విలన్‌గా సుపరిచితమయ్యాడు. ‘ఫోర్స్’తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన జమ్వాల్.. ‘కమాండో’ చిత్రంతో యాక్షన్ హీరోగానూ గుర్తింపు పొందాడు. తాజాగా విద్యుత్ జమ్వాల్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన నాలుగు గాజు సీసాల ఆసరాతో బస్కీలు తీశాడు. రెండు కాళ్ల కింద, రెండు చేతుల కింద సీసాలను పెట్టుకున్న ఆయన అలవోకగా బస్కీలు తీయడం ఆకట్టుకుంటోంది. కేరళకు చెందిన అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్స్ అయిన కలారిపయట్టులో ఇదో భాగం. విద్యుత్ మూడేళ్ల వయసు నుంచే కలారిపయట్టులో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఈ వీడియోన్ విద్యుత్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
మరోవైపు విద్యుత్ జమ్వాల్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘యారా’.. షూటింగ్ దశలోనే ఆగిపోయిందట. సినిమాను కొనుక్కునేవారు లేకపోవడంతో చిత్రీకరణ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటుడు విద్యుత్ జమ్వాల్ 21ఏళ్ల యువకుడి నుంచి 50 ఏళ్ల వృద్ధుడిలా నటించాల్సి ఉండడంతో.. ఎప్పటికప్పుడు శరీరాకృతిని మలుచుకుంటూ విద్యుత్ చాలా కష్టపడ్డాడట.