తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మహానాయకురాలు అమ్మ జయలలిత.ఎంజీఆర్,కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న జయ…అమ్మగా ప్రజల్లో చెరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మరింతగా చేరువైన జయలలిత దశాబ్దాల పాటు తమిళరాజకీయాలను శాసించింది. ఈ నేపథ్యంలో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు ముందుకురాగా దర్శకురాలు ప్రియదర్శని ఏకంగా ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏఎల్ విజయ్ …లైకా నిర్మాణ సంస్థతో భారీ బడ్జెట్‌లో జయ బయోపిక్‌ని తెరకెక్కిస్తోంది. ఇటీవల స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న విజయ్…త్వరలో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రకు విద్యాబాలన్‌ను, ఎంజీఆర్ పాత్రకు అరవింద్‌స్వామిని ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 24న జయలలిత్ బర్త్ డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. ‘అమ్మా ఎండ్రాల్ అన్బు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 2020 ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇక ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నిత్యామేనన్ …జయలలితగా నటిస్తుండగా మరోవైపు భారతిరాజా కూడా అమ్మ బయోపిక్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.