ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ‘ఎన్టీఆర్’ చిత్రీకరణ జరుగుతోంది. ఇక బాలయ్య తన తల్లి బసవతారకం పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ అగ్రహీరోయిన్ విద్యాబాలన్ ను ఎంపిక చేశాడు. బాలయ్యే స్వయంగా ఆమె ఇంటికెళ్లి నటించమని ఒప్పించాడు. ఇటీవలే విద్యాబాలన్ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. అంతేకాదు హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్‌ను బాలయ్య తన ఇంటికి తీసుకెళ్లి మరీ అతిథి సత్కారాలు చేశారు.
ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. అదేంటనేగా మీ సందేహం.. బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌కు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారన్నదే ఆ వార్త. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఆమెకు అంత రెమ్యునరేషన్ ఇచ్చారా.. అంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క విద్యాబాలన్‌కే ఇంత పెద్ద మొత్తంలో చెల్లిస్తే.. ఇక సినిమా మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.