- Advertisement -
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన విద్యా తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన కథానాయకుడు సినిమాలో కీలకపాత్ర పోషించింది.
లేటెస్ట్‌గా గణితమేధావి శకుంతలా దేవి పాత్రలో విద్యాబాలన్ నటించనుంది. రోనీ స్ర్కూవాలా నిర్మిస్తుండగా అను మీనన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విద్యాబాలన్ కుమార్తె అనుపమ బెనర్జీగా ‘దంగల్’ ఫేమ్ సాన్య మల్హోత్రా నటించనున్నారు.
సాన్యకు కథ నచ్చింది. తను విద్యాబాలన్‌కు పెద్ద ఫ్యాన్. ప్రతిభావంతురాలికి సంబంధించిన కథ, విద్యాబాలన్ కాంబినేషన్ అనగానే వెంటనే అంగీకరించిందని టాక్. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
- Advertisement -