మళ్లీ వేశ్యగా డర్టీ భామ…

227
Vidya Balan Begum Jaan poster
- Advertisement -

ఓ డర్టీ పిక్చర్, ఓ కహానీ… ఈ సినిమాల్లో విద్యా బాలన్ ను నటనను మీరు చూసి ఉండరు.. ఆమె ఆ క్యారెక్టర్లలో జీవించింది. డర్టీ పిక్చర్ లో  తనదైన డర్టీ యాక్టింగ్ తో విద్యా బాలన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  అందుకే… డర్టీ పిక్చర్ లో వేశ్యగా నటించినా ఆమెకు మాత్రం మంచిపేరు తెచ్చిపెట్టింది. తర్వాత కహానీలో కూడా తనదైన నటనతో మంచిమార్కులు కొట్టేసింది.  ఇప్పుడు మరోసారి అటువంటి తరహా ప్రయోగం చేయబోతున్నది విద్యా బాలన్…..

తన తాజా మూవీ బేగమ్ జాన్ లో ఆ స్థాయి కలరింగ్ ఇచ్చేస్తోంది వస్తోంది విద్యా. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్షన్ లో  తెరకెక్కుతున్న ఈ మూవీలో వేశ్య గృహాన్ని నడిపే మహిళగా కనిపించనుంది విద్యా బాలన్. ఏప్రిల్ 14 న విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది విద్యా బాలన్.

కాసింత ఒళ్లు చేసిన దేహంతో.. 3/4 హ్యాండ్స్ వేసుకున్న టాప్.. మెరూన్ కలర్ లెహంగా వేసుకుని ఓరగా చూస్తున్న విద్య మనకు ఈ పోస్టర్ లో దర్శనం ఇస్తుంది. చేతిలో హుక్కా పట్టుకుని.. మరో పక్కన గన్ దగ్గర పెట్టుకున్న అమ్మడి లుక్ చూస్తుంటే.. నిజంగా వేశ్యా గృహాన్ని నడిపే మహిళ ఇలానే ఉంటుందేమో అనిపించేయడం ఖాయం. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Vidya Balan Begum Jaan poster

- Advertisement -