తెలంగాణలో ఏప్రిల్ 25నుంచి జూన్11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యాసంవత్సరానికిగాను జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు SA–II పరీక్షలను నిర్వహించనున్నట్టు కూడా తెలిపారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఆరు నుంచి 8వ తరగతి వరకు ఉదయం 9..30 నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 12.30వరకు SA–II ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 21 నుంచి 24వ తేదీ వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేసి ఏప్రిల్ 25న పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి…