నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పై ఎఫైర్ ఈ రోజు బయట పడింది. లండన్లోని ఓ హోటల్ చెఫ్ తో నాగ చైతన్య ఫోటో దిగడం, ఆ ఫొటోలో శోభిత ధూళిపాళ్ల కనిపించడం తెలిసిన విషయాలే. ఐతే, ఈ ప్రేమ వ్యవహారం సమంత వరకూ వెళ్ళింది. దాంతో, సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి అంటూ చైతుతో తన విడాకులపై సమంత ఓపెన్ అయిపోయింది. ఇంతకీ సమంత ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం.
సమంత మాట్లాడుతూ.. ‘వైవాహిక బంధంలో నేను పూర్తి నిజాయతీగా ఉన్నాను. నా నుంచి ఎలాంటి తప్పు లేదు, చిన్న పొరపాటు కూడా లేదు. కాకపోతే, ఆ బంధం వర్కౌట్ కాలేదు అని సమంత చెప్పుకొచ్చింది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ గురించి కూడా సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘మా వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే నాకు ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ పాట ఆఫర్ వచ్చింది. మొదట నేను సుకుమార్ గారికి నో అనే చెప్పాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను. నేనే తప్పు చేయనప్పుడు నేనెందుకు ఇంట్లో ఉండాలి. అందుకే ఆ పాట చేశాను.
ఐతే, ‘ఊ అంటావా’ పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు నాకు ఫోన్లు చేసి తిట్టారు. ‘నువ్వు ఇంట్లో కూర్చో చాలు. విడిపోయిన వెంటనే నువ్వు ఇలా ఐటెమ్ సాంగ్స్ చేస్తే అస్సలు బాగోదు’ అంటూ నాకు ఉచిత సలహాలు ఇచ్చారు. వైవాహిక బంధంలో నేను 100 శాతం నిజాయతీగా ఉన్నాను. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి ? అందుకే ఆ పాట చేశా. అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి…