స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి చరిత్రపై సినిమా తీయడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా సినిమాను వీక్షించారు వెంకయ్యనాయుడు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. చక్కని సినిమాను తెరకెక్కించారు. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డికి అభినందనలు. సినిమాలో వలస పాలకుల నియంత పాలన గురుంచి చక్కగా చూపించారన్నారు.
ఈ సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతుంది. భారత దేశము యొక్క స్వరూపాన్ని సినిమాలో చూపించారు. సినిమాలో చిరంజీవి నటన చాలా బాగుంది. అమితా బచ్చన్ , తమన్నా, నయనతార చాలా బాగా నటించారు.ఇలాంటి దేశభక్తి తో కూడిన సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ సినిమా కోసం సమయం తీసుకొని సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒకొక్క మెట్టు ఎక్కుకుంటూ రాజకీయాలలో వెంకయ్యనాయుడు ఎదిగారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అడిగాను.. ఇస్తే మోదీని కలిసి సినిమా చూపిస్తామని చెప్పారు.
ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు. #SyraaNarashimaReddy pic.twitter.com/rUJrM353Dv
— Vice President of India (@VPSecretariat) October 16, 2019