బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రం ‘సూపర్ 30’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కుటుంబంతో కలసి వీక్షించారు. ఉప రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రత్యేక స్క్రీనింగ్ వేయించుకొని చూశారు. ఆ సమయంలో వెంకయ్య నాయుడుతో పాటు చిత్ర బృందం అంతా ఉన్నారు. సూపర్ 30 చిత్రం తన మనసుని కదిలించదని వెంకయ్య తెలిపారు.
పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించే క్రమంలో ఆనంద్ ఎన్నో ఒడిడుడుకులు ఎదుర్కొన్నారని… ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారని కితాబిచ్చారు. అనంతరం హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా, మధు మంతెన, ఒరిజినల్ ఆనంద్ కుమార్ తో కలసి ఫొటో దిగారు. ఈ ఫోటోను కూడా ఉపరాష్ట్రపతి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి వికాస్ బెహెల్ దర్శకత్వం వహించారు. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.
Happy to have watched the movie ‘Super 30’ along with the lead actor of the film Shri Hrithik Roshan, Producer Shri Sajid Nadiadwala, Shri Anand Kumar and my family members, at Uprashtrapati Bhawan, in New Delhi today. @iHrithik @teacheranand #Super30 pic.twitter.com/r8pt5mWFhS
— Vice President of India (@VPSecretariat) July 17, 2019