భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామొరోస్ అత్యున్నత పౌరపురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్’ను శుక్రవారం అందుకున్నారు. కామొరోస్ దేశాధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్యనాయుడు ఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా ఆఫ్రికా దేశం కొమొరోస్‌లో ఉపరాష్ట్రపతి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రిసెంట్’ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, 130 కోట్ల భారతీయుల తరపున గౌరవాన్ని స్వీకరిస్తున్నానని అన్నారు. భారత్-కామొరోస్ మైత్రికి గుర్తుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని, సంయుక్త లక్ష్యమే తమను కలిపిందని, పరస్పర పురోగతి స్వప్నమిదని పేర్కొన్నారు.
It is an honour to have been conferred 'The Order of the Green Crescent', the highest Civilian Honour of #Comoros, by the President of the Union of Comoros, Mr. Azali Assoumani, in #Moroni today. @Azali_officiel #VPinAfrica pic.twitter.com/0V1FMKgBlu
— Vice President of India (@VPSecretariat) October 11, 2019