వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

11
- Advertisement -

టీమిండియా ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ వేదికగా ఆ దేశ అండర్ 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు.వర్షం కారణంగా ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కొల్పోయి 268 పరుగులు చేయగా 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 34.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కొల్పోయి 274 పరుగులు చేసింది.

కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన వైభవ్ ..31బంతుల్లో ఆరు సిక్సులు, తొమ్మిది ఫోర్లతో 86 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి తోడు విహార్ మల్హోత్రా (46), కనిష్క చౌహన్ (43 నాటౌట్), అంబ్రీష్ (31 నాటౌట్) రాణించడంతో భారత్ గెలుపు సునాయసమైంది.

అండర్ -19 వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు వైభవ్. గతంలో రిషబ్ పంత్ అండర్-19 వన్డేల్లో 18బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Also Read:ఒకే జిల్లా…గుండెపోటుతో 23 మంది మృతి

- Advertisement -