కాంగ్రెస్ వ్యూహకర్తపై వీహెచ్‌ సంచలన కామెంట్స్

37
- Advertisement -

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఓట‌మి గ‌ల కార‌ణాల‌పై ఏఐసీసీ ప్ర‌తినిధులు ఎంక్వైరీ చేస్తున్నారని… లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను, ఎవ‌రి ఆలోచ‌న వారు త‌ప్ప‌నిస‌రిగా చెబుతారు అన్నారు.

అన్నింటి కంటే ముందు కొనుగోలును అడ‌గాలి…. సీఎంను కాదు. సునీల్ కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఏం ఇచ్చాడో తెలియ‌దు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. సునీల్ కొనుగోలులోనే అంతా ఉంది… ఆయ‌న ఏం రిపోర్టు ఇచ్చిండు అనేది తేలాలి అని చెప్పుకొచ్చారు.

పోటీ చేసే విషయంలో తనకు తీవ్ర అన్యాయం జ‌రిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్య‌స‌భకు పంపించే అవ‌కాశం ఇస్తే బాగుంటుంది… ఎనిమిదేండ్ల‌లో నాకు ఒక్క ప‌ద‌వి కూడా లేదు అని చెప్పారు.

Also Read:KTR:కాంగ్రెస్ వైఖరితోనే విద్యార్థులకు అవస్థ

- Advertisement -