ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన వేట్టయన్

4
- Advertisement -

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’.టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. సుభాస్క‌ర‌న్ నిర్మాత‌. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న వేట్ట‌య‌న్ ద‌ హంట‌ర్‌ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇన్‌స్టంట్‌గా సూప‌ర్‌హిట్ టాక్ తెచ్చుకుంది ట్రైల‌ర్‌.

`ఖైదు చెయ్ ఖైదు చెయ్‌… నేర‌స్తుడిని ఖైదు చెయ్‌, ఖైదు చెయ్ ఖైదు చెయ్‌… నేర‌స్తుడిని ఖైదు చెయ్‌` అంటూ మొద‌ల‌వుతుంది వేట్ట‌య‌న్ – ద హంట‌ర్ ట్రైల‌ర్‌.

`ఈ దేశంలో ఆడ‌పిల్ల‌ల‌కు భ‌ద్ర‌త లేదు. కానీ, పోరంబోకుల‌కు బాగా భ‌ద్ర‌త ఉంది.ఇలాంటి మ‌గ మృగాల‌ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేయాలి` అని ట్రైల‌ర్‌లో వినిపించే డైలాగుల‌తో అక్క‌డ జ‌రిగిన విష‌యమేంటో స‌గ‌టు ప్రేక్ష‌కుడికి ఇట్టే అర్థ‌మైపోతుంది.`నేర‌స్తుడిని వెంట‌నే ప‌ట్టుకోవాలి. అందుకు ఏ యాక్ష‌న్ అయినా తీసుకోండి….
ఇట్ వాజ్ ఎ బ్రూట‌ల్ మ‌ర్డ‌ర్ సార్…ఇదే క్రిమిన‌ల్ ఐడెంటిటీ అని ఏదీ ఐసోలేట్ చేసి చెప్ప‌లేక‌పోతున్నాం సార్‌…మీరు లా అండ్ ఆర్డ‌ర్ మెయింటెయిన్ చేయ‌లేక‌పోతే అంద‌రూ రిజైన్ చేసి వెళ్లిపోండ‌య్యా..`.. ఈ డైలాగుల‌న్నీపోలీస్ డిపార్టుమెంట్‌లో ర‌క‌ర‌కాల సంద‌ర్భాల‌ను క‌ళ్ల‌కు క‌డ‌తాయి.

వారంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిపోవాలి…
అని రావు ర‌మేష్ అనే మాట‌కు…
అక్క‌ర్లేదు సార్‌. వారం రోజులు అక్క‌ర్లేదు. మూడే రోజుల్లో డిపార్ట్ మెంట్‌కి మంచి పేరొస్తుంది అంటూ స‌మాధానం చెబుతూ ఎంట్రీ ఇస్తారు సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌. ఆయ‌న స్టైలిష్ న‌డ‌క‌, హుందాత‌నం చూస్తే, వేట్ట‌య‌న్ – ద హంట‌ర్ అనే పేరుకు ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయిన క‌టౌట్ అనిపిస్తుంది.
జ‌స్టిస్ డినైడ్ అంటూ… కారులో వెళ్తూ క‌నిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌.
అంద‌రూ క‌నిపిస్తున్న‌ప్పుడు రానా క‌నిపించ‌క‌పోతే ఎలా…
కాలం విలువ తెలిసిన మ‌నిషి మాత్ర‌మే ఏదైనా సాధించ‌గ‌ల‌డు అంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చేస్తారు యాంగ్రీ యంగ్ మ్యాన్ రానా.
దొంగంటే ముసుగేసుకుని తిర‌గాల‌నే రూలేం లేదు. కొంచెం బుర్రుంటే చాలు.. అంటూ వైవిధ్య‌మైన కేర‌క్ట‌ర్‌తో ప‌రిచ‌య‌మ‌య్యారు ఫాహ‌ద్ ఫాజిల్‌.

`క్రైమ్ కేన్స‌ర్ లాంటిది. దానికి పెర‌గ‌నివ్వ‌కూడ‌దు.
సార్ త‌న ద‌గ్గ‌ర లాయ‌ర్ల సైన్య‌మే ఉంది.
వాడి నెట్‌వ‌ర్క్ లో రెండు వేల మందికి పైగా ఉన్నారు.
ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెప‌న్స్, ప‌వ‌ర్ అన్నీ ఉండి క్రిమిన‌ల్ అట్రాసిటీస్ జ‌రుగుతున్నాయంటే అక్క‌డ పోలీసులు స‌రిగ్గా ప‌నిచేయ‌ట్లేద‌ని అర్థం. ఊరికే మాట్లాడి ప్ర‌యోజ‌నం లేదు.. వాడిని లేపేద్దాం. గాట్ ఇట్‌..
య‌స్ సార్‌.. `

ఈ మాట‌ల‌న్నీ మ‌ళ్లీ ప్రేక్ష‌కుడిని క‌థ‌లోకి తీసుకెళ్తాయి. చ‌క‌చ‌కా జ‌రుగుతున్న స‌న్నివేశాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు అనిపిస్తాయి. అక్క‌డి వాతావ‌ర‌ణం ఎంత వేడిగా ఉందో చెప్ప‌డానికి ఇంత‌క‌న్నా మాట‌లు అక్క‌ర్లేద‌న్న‌ట్టు క‌ట్ చేశారు ట్రైల‌ర్‌ని.

Also Read:జానీ మాస్టర్‌కు మధ్యంత బెయిల్

ఇంత హీట్‌ని కూల్ చేసేలా ఉన్నాయి ట్రైల‌ర్‌లో అమితాబ్ డైలాగులు..
న్యాయం అన్యాయ‌మైన‌ప్పుడు న్యాయంతోనే సెట్ చేయాలి. అంతేగానీ, ఇంకో అన్యాయంతో కాదు అని అమితాబ్ చెప్పిన డైలాగ్‌ని బ‌ట్టి, ఆయ‌న కేర‌క్ట‌ర్ మీద ఓ అవ‌గాహ‌నకు వ‌చ్చేయొచ్చు.
`అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు పోలీసులు మౌనంగా ఉండేక‌న్నా, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవ‌డం త‌ప్పేమీ కాదు జ‌డ్జిసార్ ` అంటూ అమితాబ్ ముందు నిలుచున్న వేట్ట‌య‌న్‌ని చూసిన ఎవ‌రికైనా వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌షిప్ ఎలాంటిదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

న‌న్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడ‌టం ఎవ‌రి వ‌ల్లా కాదు అని డైన‌మిక్‌గా సూప‌ర్‌స్టార్ చెప్పే డైలాగుకు ఇన్‌స్టంట్‌గా చ‌ప్ప‌ట్లు, విజిల్స్ మోగుతున్నాయి.
జైల‌ర్ త‌ర్వాత ఓ ప‌క్కా యాక్ష‌న్ సినిమాలో భ‌లేగా ఫిట్ అయ్యారు త‌లైవ‌ర్ అంటూ ట్రైల‌ర్‌ని రిపీటెడ్‌గా చూస్తూ మాస్ జ‌నాలు ఉర్రూత‌లూగుతున్నారు.

2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా వేట్ట‌య‌న్ ద హంట‌ర్‌. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల‌కు పుట్ ట్యాపింగ్ ట్యూన్స్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ర‌విచంద‌ర్… ర‌జ‌నీకి నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావ‌టంతో ‘వేట్టయన్- ద హంట‌ర్‌’పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన‌ ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్‌ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

- Advertisement -