న్యూస్ రీడర్ వెంకట్రామన్ కన్నుమూత..

2
- Advertisement -

ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ వెంకట్రామన్(102) చెన్నైలో కన్నుమూశారు. భారత స్వాతంత్ర్యం సాధించిన ఘట్టాన్ని తమిళంలో ప్రసారం చేసిన వ్యక్తి వెంకట్రామన్. 1947 ఆగస్టు 15వ తేదీ ఉదయం 5:45 గంటలకు, ఆయన ఈ వార్తను రేడియో సిలోన్ ద్వారా తమిళంలో మొదట ప్రసారం చేశారు.

వెంకట్రామన్ 64 సంవత్సరాల పాటు ఆకాశవాణిలో సేవలు అందించారు. తొలుత స్క్రిప్ట్ రైటర్‌గా రేడియోలో అడుగు పెట్టిన వెంకట్రామన్, అనంతరం న్యూస్ విభాగంలో చేరి న్యూస్ రీడర్‌గా సేవలందించారు. న్యూఢిల్లీలో తమిళ న్యూస్ విభాగంలో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు..

- Advertisement -